ప్రముఖ సిని నటుడు బోస్ మృతి

-

టాలీవుడ్ ప్రముఖ సిని నటుడు సుబాస్ చంద్ర బోస్ అలియాస్ బోస్ ఈరోజు హైదరాబాద్ గాంధి హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. నాలుగు రోజుల క్రితం కృష్ణానగర్ లో గల తన ఇంట్లో జారి కిందపడ్డార్. ఈ క్రమంలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. గాంధి హాస్పిటల్ లో చేర్పించి చికిత్స చేస్తున్నారు. అయితే నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడిన బోస్ ఆదివారం మరణించారు.

సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన బోస్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే అయితే ఆయన పేరు అందరికి తెలియకపోవచ్చు కాని అతన్ని చూస్తే మాత్రం గుర్తుపడతారు. పూరి జగన్నాథ్, కృష్ణవంశీ సినిమాల్లో బోస్ ఎక్కువగా కనిపిస్తారు. ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో తన సిని కెరియర్ గురించి చెబుతూ 1990లో వచ్చిన సాహస పుత్రుడు సినిమా తన తొలి సినిమా అని చెప్పారు బోస్. రవిరాజా పినిశెట్టి డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమాలో సుమన్ హీరోగా చేశారు.

ఈవివి సత్యనారాయణ తీసిన చెవిలో పువ్వు, హిందిలో చిరంజీవి చేసిన ప్రతిబంధ్ సినిమాలో కూడా బోస్ నటించారట. ఆ తర్వాత కొదమ సిం హం సినిమాలో కూడా నటించానని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు బోస్.

ప్రేమఖైదీ సినిమాలో ప్రతినాయకుడి రోల్ చేసిన బోస్ పూరికి మంచి స్నేహితుడని తెలుస్తుంది. కృష్ణవంశీ గులాబీ సినిమాలో కూడా తనకు అవకాశం ఇచ్చాడని.. డేంజర్ తర్వాత కృష్ణవంశీ కూడా తనకు అవకాశం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు బోస్. ఆయన మృతి పట్ల టాలీవుడ్ సెలబ్రిటీలు బోస్ కుటుంబానికి ప్రగాడ సానుభూతి ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news