కీలకమైన మ్యాచ్ లో పంజాబ్ పై ఢిల్లీ విజయం సాధించింది. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 17 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఫ్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది ఢిల్లీ. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి.. 142 పరుగులే చేసింది. పంజాబ్ బ్యాటర్లలో జితేశ్ శర్మ 44 పరుగులు, జానీ బెయిర్ స్టో 28 పరుగులు ధావన్ 19 పరుగులు చేసి.. పర్వాలేదనిపించారు.
ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ చరిత్ర సృష్టించాడు. తన ఐపీఎల్ కెరీర్ లో ఏకంగా 100 వికెట్లు తీసి.. చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ కెరీర్ లో 121 మ్యాచ్లు ఆడిన అక్షర్ పటేల్.. 101 వికెట్లు పడగొట్టాడు. ఇక అక్షర్ కంటే ముందుకు మరో ముగ్గురు ఆల్ రౌండర్లు ఉన్నారు. మొదటి స్థానంలో జడేజా 132 వికెట్లు, బ్రావో 183 వికెట్లు, నరైన్ 152 వికెట్లు తీసి.. వరుసగా ఉన్నారు. ఇక వీరి తర్వాత 101 వికెట్లు పడగొట్టిన.. నాలుగో స్థానంలో నిలిచాడు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్.