శరీరంలో జింక్ తక్కువైతే ఈ సమస్యలు వస్తాయట.. జాగ్రత్త

-

శరీరానికి విటమిన్లతో పాటు జింక్, ఐరాన్, పొటాషియం, మెగ్నీషియం వంటివి కూడా చాలా ముఖ్యం. చాలామంది వీటికోసమే మల్టీవిటమిన్ టాబ్ లెట్స్ వాడుతుంటారు. అయితే జింక్ తక్కువైతే..ఎలాంటి సమస్యలు వస్తాయో, సరిరానికి జింక్ ఎంత ముఖ్యమో, అధ్యయనాల ప్రకారం ఏం తేలిందో ఇప్పుడు చూద్దాం.

ఆహారంలో ఉండే జింక్ సప్లిమెంట్లు జలుబు, దగ్గును నివారిస్తాయి. జలుబు, దగ్గు బాధిస్తున్న సందర్భాల్లో జింక్ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా కేవలం 2 రోజుల్లోనే కోలుకోవచ్చునని నూతన పరిశోధనలు చెబుతున్నాయి. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు తమ తాజా పరిశోధనల ఫలితాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు.

శరీరంలో జింక్ చేసే పని ఏంటి?

జింక్ సప్లిమెంట్ అనేది శరీరంలో అనేక విధులు నిర్వహించే ఒక పోషకం. ఇది ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో వాపును నివారించడంలో సహాయపడుతుంది. జింక్ మాంసం, షెల్ఫిష్ మరియు జున్నులో ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. జింక్ ఎక్కువ తీసుకుంటే కూడా శరీరంలో ఐరన్ లోపం ఏర్పడి ఎముకలు బలహీనపడతాయి.

జింక్ సంక్రమణ రేటును తగ్గిస్తుందనీ, అదేవిధంగా అనారోగ్యం సమయాన్ని కూడా తగ్గిస్తుందనీ నిపుణులు అంటున్నారు. అయితే ఎంత పరిమాణంలో తీసుకోవాలి అనేది స్పష్టంగా చెప్పలేదు. వెస్ట్రన్ యూనివర్శిటీలోని శాస్త్రవేత్తలు జింక్ అలాగే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను అనుసంధానించే అధ్యయనాలను పరిశీలించారు. జింక్ జలుబు,దగ్గు లక్షణాలను కూడా తగ్గించగలదని పరిశోధనలో వెల్లడించింది. ఇది ముక్కు కారటం, తలనొప్పి, శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.

​ఆహారంలో ఎలా?

ఆహారం ద్వారా పురుషులు 9.5 mg, మహిళలు 7 mg జింక్ తీసుకోవచ్చని బ్రిటన్ ఆరోగ్య సంస్థ NHS వెల్లడించింది. జింక్ సప్లిమెంట్లను నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువ తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు..యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం.. 14 ఏళ్ల వయసు పైబడిన అబ్బాయిలకు 11 మి.గ్రా, బాలికలకు 8 మి.గ్రా జింక్ మాత్రమే అవసరం. గర్భిణిలకు 11 మి.గ్రా, పాలిచ్చే తల్లులకు 12 మి.గ్రా జింక్ అవసరం పడుతుంది.

పరిశోధన ఎలా చేశారంటే..

పరిశోధకుల బృందం 5500 మంది వ్యక్తులపై 28 జింక్ ట్రయల్స్‌ను పరిశోధించింది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న రోగులకు నోటి ద్వారా లేదా నాసికా స్ప్రే ద్వారా జింక్ ఇవ్వవచ్చని పరిశోధనలో వెల్లడించారు. పరిశోధన సమయంలో, జింక్ ఇచ్చిన వారికి, వారి పరిస్థితి 2 రోజుల్లో మెరుగుపడింది. అదే సమయంలో, జింక్ ఇవ్వని రోగులలో, ఏడవ రోజు వరకు లక్షణాలు కొనసాగుతాయట.

మొటిమల సమస్యకు పరిష్కారం
మొటిమల సమస్యతో బాధపడుతున్నవారు జింక్ ఉండే ఆహారం తీసుకుంటే సమస్యనుండి విముక్తి లభిస్తుందట. కాలిన గాయాలు, పుండ్లన త్వరగా మానేలా చేయటంలో జింక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పుండ్లు మాన్పేందుకు తయారుచేసే అనేక అయింట్ మెంట్లు, మందుల్లో జింక్ ను ఉపయోగిస్తారు. కాబట్టి జింక్ ను శరీరానికి కావాల్సిన మోతాదులో మాత్రమే అందించాలి. గర్భిణీ స్త్రీలు రోజుకు 40 ఎంజి కంటే ఎక్కవ జింక్ తీసుకోకూడదు.

​జింక్ ఉండే ఆహారాలు

డార్క్ చాక్లెట్: ఇవి తింటే శరీరానికి జింక్ అందటమేకాదు.. పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. డార్క్ చాక్లెట్ జీవక్రియను , మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

పుచ్చకాయ గింజలు: జింక్.. పొటాషియం ఇందులో పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ గింజలను ఎండబెట్టి మెత్తగా చేసి ఆహారంలో చేర్చుకోవచ్చు. రోజూ కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు.

డెయిరీ ప్రొడక్టులు: జింక్ లోపాన్ని పాలు, జున్ను, పెరుగు తినటం ద్వారా కూడా తీర్చవచ్చు.

చేపలు: జింక్, ప్రొటీన్లతో పాటు మంచి పరిమాణంలో అనేక పోషకాలు చేపల్లో ఉంటాయి. ఇది వారానికి రెండు సార్లు తీసుకోవచ్చు.

గుడ్డు: ఒక గుడ్డులో 5 శాతం వరకు జింక్ ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ మీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, దెబ్బతిన్న కండరాలను కూడా రిపేర్ చేస్తుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే

Read more RELATED
Recommended to you

Latest news