హైదరాబాద్‌లో మరో నీచం.. వాష్‌రూమ్‌ కెమెరా పెట్టి..

-

సమాజంలో స్త్రీలకు భద్రత రోజురోజుకు కరువైపోతోంది. స్కూల్‌లో, కాలేజీలు, పనిచేసే దగ్గర ఇలా ప్రతి చోటా కామాంధులు మాటేసుకొని కూర్చున్నారు. సందు దొరికితే చాలు తమలో ఉన్న కామాంధుడుకి పని చెప్పి రాక్షసానందం పొందుతున్నారు. అలాంటి ఘటనే ఇది.. మ‌హిళ‌లు వాష్‌రూమ్‌లో ఉన్న స‌మ‌యంలో ఓ యువ‌కుడు వీడియోలు చిత్రీక‌రించి, మాన‌సికంగా, లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.92లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన మిథున్ దాస్.. రోడ్ నం.92లోని ఓ బోటిక్‌లో బాయ్‌గా ప‌ని చేస్తున్నాడు. అయితే బోటిక్‌లో ఉన్న వాష్‌రూమ్‌లో ఎవ‌రికీ తెలియ‌కుండా.. త‌న సెల్‌ఫోన్‌ను వీడియో మోడ్‌లో ఉంచాడు.

How to Hide a Camera Phone in Your Bathroom - a Smart Guide

దీంతో బోటిక్‌లో ప‌ని చేస్తున్న మ‌హిళ‌లు.. వాష్‌రూమ్‌కు వెళ్ల‌గా ఆ దృశ్యాలు మొబైల్‌లో రికార్డు అయ్యాయి. ఇలా మిథున్ దాస్ ప‌దుల సంఖ్య‌లో మ‌హిళ‌ల వీడియోల‌ను చిత్రీక‌రించి భ‌ద్ర‌ప‌రుచుకున్నాడు. అయితే బోటిక్‌లో ప‌ని చేసి మానేసిన చేసిన‌ ఓ మ‌హిళ ఫోన్‌కు మూడు రోజుల క్రితం ఓ వీడియోను పంపాడు. ఆ వీడియోను చూసి ఆమె షాక్‌కు గురైంది. దీంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మిథున్ దాస్ ఫోన్ నుంచి త‌న‌కు వీడియో రావ‌డంతో.. నేరుగా అత‌న్నే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌ని ఫోన్‌లో వేరే మ‌హిళ‌ల‌కు సంబంధించిన మ‌రిన్ని వీడియోలు ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని రిమాండ్‌కు త‌ర‌లించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news