సూర్యకాంతం.. ఈ పేరు వింటేనే చాలామందికి భయం అని చెప్పవచ్చు. గయ్యాళి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది సూర్యకాంతం. తన హాస్యంతో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయింది సూర్యకాంతం. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు సూర్యకాంతం అని పేరు పెట్టడానికి కూడా భయపడేవారు. అందుకు కారణం ఏమిటంటే సూర్యకాంతం అనే పేరు పెడితే వారి పిల్లలు కూడా గయ్యాళిగా మారిపోతారేమో అన్న భయంతో సూర్యకాంతం అనే పేరు పెట్టడానికి కూడా భయపడేవారు. ఇకపోతే ఈమె తన నటనతో సహజనట కళా శిరోమణి.. హాస్య నట శిరోమణి.. బహుముఖ నటనా ప్రవీణ.. రంగస్థలం శిరోమణి ఇలా పలురకాల బిరుదు లని పొందింది సూర్యకాంతం.ఇకపోతే ఒక రోజు గుమ్మడి వెంకటేశ్వరరావు టెలివిజన్ ఇంటర్వ్యూలో.. ఆయన నవ్వుతూ సూర్యకాంతం తో స్వయంగా ఇలా చెప్పాడు. ఇక నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది .. సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు అంటూ ఆయన హాస్యం గా అన్నాడు.. ఇకపోతే అంతలా బ్రాండ్ గా సూర్యకాంతం పేరు చిరస్థాయిగా మిగిలిపోయింది. 1924 అక్టోబర్ 28వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురం లో తమ తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించింది సూర్యకాంతం. ఇక పోతే తన ఆరు సంవత్సరాల వయసులోనే పాడటం , నాట్యం చేయడం వంటివన్నీ నేర్చుకుంది. ఇకపోతే సూర్యకాంతం సినిమాలలోకి వాటిని చూసి ఆకర్షితులై వచ్చినట్లు సమాచారం . ఇక పూర్తి విశేషాలు ఏమిటో కూడా ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.సూర్యకాంతం పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు చూసి బాగా ఆకర్షితురాలైంది. ఇక ఆ పోస్టర్ల కారణంగా ఆమె సినిమాల్లోకి రావాలనే కోరిక ను చంపుకోలేక.. ఇంటిలో వారిని కాదని మరి నటించాలనే ఆశ తో చెన్నై చేరుకుంది. ఇక మొదటగా 75 రూపాయల జీతంతో చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా నటించింది. ఆ తరువాత తన నటనతో తెలుగు అభిమానుల గుండెల్లో నిలిచి పోయేలా జీవితాంతం అవే పాత్రలలో గుర్తుండిపోయేలా నటించింది సూర్యకాంతం. ఇక ఎప్పటికీ సూర్యకాంతం అంటే ఆమె గుర్తుగా అన్నట్టు గా చిరస్థాయిగా మిగిలిపోయింది