అమెరికా ఉపాధ్యక్షుడిగా జే.డీ.వాన్స్.. ప్రకటించిన ట్రంప్

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ పై ఘన విజయం సాధించారు. తాజాగా తన మద్దతుదారులనుద్దేశించి మాట్లాడారు ట్రంప్. అమెరికాలో ఇలాంటి విజయం తాను ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. అమెరికాకు స్వర్ణయుగం రాబోతుందన్నారు. తన విజయానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికా రాజకీయాల్లో కొత్త స్టార్ ఎలన్ మస్క్ అని పేర్కొన్నారు ట్రంప్.

మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడిని ప్రకటించారు. ఉపాధ్యక్షుడు జే.డీ.వాన్స్ అంటూ ప్రకటించేశారు. రిపబ్లిక్ పార్టీ విజయం పూర్తయిన తరువాత ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేయనున్నారు. ఆయన ఏపీలోని నిడదవోలు నియోజకవర్గం వడ్లూరుకు చెందిన ఉషా చిలుకూరి భర్తనే జే.డీ.వాన్స్. దీంతో తెలుగింటి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు అయ్యారు. విజయోత్సవ ప్రసంగంలో ట్రంప్.. వాన్స్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇది తెలుగు వారికి గర్వకారణమని ఆ గ్రామస్తులు పేర్కొంటున్నారు. అలాగే తన విజయంలో మెలానియా కీలక పాత్ర పోషించారని ట్రంప్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news