మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం.. మూడు నెలలుగా..!!

-

ఏపీలో మరో వాలంటీర్ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

volunteer-brk
volunteer-brk

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం వేరే గ్రామానికి వెళ్లి నివాసం ఉంటున్నారని, దీంతో బాలిక తన అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటుందన్నారు. ఈ క్రమంలో వాలంటీర్‌గా పని చేస్తున్న రావిపాటి కోటయ్య బాలికను బెదిరించి లొంగదీసుకున్నాడు. గత మూడు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని బయట చెబితే.. చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే వాలంటీర్ నుంచి వేధింపులు పెరిగాయి. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.

దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలికి చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, నిందితుడి పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలో నిందితుడిని పట్టుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news