బీజేపీ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ను పోలీసులు అడ్డుకోవడం.. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. పోలీసులు అడ్డుకోవడంతో.. వారిపై సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాదు.. డ్యూటీలో ఉన్న సీఐను తోసేశారు సోము వీర్రాజు.
దీంతో.. స్థానికంగా హై టెన్షన్ నెలకొంది. ఇటీవలే అల్లర్లు చెలరేగిన కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పర్యటనకు బయలు దేరిన సోము వీర్రాజును తూర్పు గోదావరి జిల్లా జొన్నాడ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. సోము వీర్రాజు కారు ముందు ఓ భారీ వాహనాన్ని ఉంచారు. దీంతో పోలీసుల తీరుపై సోము వీర్రాజు ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమలాపురం అల్లర్లలో గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న తనను అడ్డుకోవడమేమిటని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లర్ల నేపథ్యలో ఇంకా పోలీసు ఆంక్షలు కొనసాగుతున్న అమలాపురం లో ప్రముఖు పర్యటన కు అనుమతి ఇవ్వడంలేదని పోలీసులు చెబుతున్నారు.