దోషులను ప్రజల ముందు నిలబెడతాం…ఫోన్ ట్యాపింగ్ పై పెగాసెస్ హోస్ కమిటీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల సమాచారాన్ని అప్రజాస్వామికం తస్కరించిందని.. నిన్న, ఇవాళ సంబంధిత శాఖల అధికారులతో ప్రాధమికంగా చర్చించామని పేర్కొన్నారు.
మాకు కావాల్సిన సమాచారాన్ని అడిగామని.. వచ్చే సమావేశంలో మరింత లోతుగా అధ్యయనం చేస్తామని హెచ్చరించారు. జూలై 5 వ తేదీన కమిటీ మళ్ళీ సమావేశం అవుతుందని.. మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సభ ముందు పెడతామని హెచ్చరించారు.
గత ప్రభుత్వం డేటా చౌర్యం విషయంలో అనేక దొంగ పనులు చేసిందని… ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పామన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పిన అంశాలు కూడా కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని.. అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి ప్రైవేట్ ఏజెన్సీల నుంచి సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసిందని తెలిపారు. వ్యక్తుల వ్యక్తిగత గోప్యత, అప్రజాస్వామికంగా ఎన్నికల్లో లబ్ది పొందే ప్రయత్నం చేశారని వివరించారు.