వాము టీతో ఇన్ని లాభాలా….? గ్యాస్‌, అసిడిటీ ఉష్‌ కాకి

-

వాము వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొందాలంటే.. రోజూ నేరుగా వామును తిన‌వ‌చ్చు. ఒక టేబుల్ స్పూన్ వాములో కొద్దిగా ఉప్పు క‌లిపి బాగా న‌లిపి వెంట‌నే ఆ వాము తిని నీటిని తాగాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి వాడుతున్న వంట ఇంటి పోపు దినుసుల్లో వాము కూడా ఒక‌టి. దీని రుచి కారంగా, ఘాటుగా ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ వాము మ‌న‌కు క‌లిగే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉపశ‌మ‌నం క‌లిగిస్తుంది. ముఖ్యంగా ద‌గ్గు, జ‌లుబు, హైబీపీ, శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు.. ఏవైనా స‌రే.. వామును వాడితే త‌క్ష‌ణ‌మే ఆయా అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి మ‌న‌కు విముక్తి ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలోనే వాము సర్వ‌రోగ నివారిణి కూడా ప‌నిచేస్తుంద‌ని ఆయుర్వేదం చెబుతోంది.

వాము అనేది నిజానికి సుగంధ ద్ర‌వ్యాల జాతికి చెందిన ఓ మొక్క‌. ఇది వేడి వాతావ‌ర‌ణంలోనే పెరుగుతుంది. ఇక వాములో అనేక అద్భుత ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే ప‌లు ఔష‌ధాల త‌యారీలోనూ వామును విరివిగా ఉప‌యోగిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే వాము ఆకుల్లో కూడా పోష‌క గుణాలు ఎక్కువ‌గానే ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే అనేక ప‌దార్థాలు వాము ఆకుల్లో ఉంటాయి. అలాగే విట‌మిన్ ఎ, సి, ఇ, కెల‌తోపాటు కాల్షియం, పొటాషియం, ఐర‌న్‌, పాస్ఫ‌ర‌స్ త‌దిత‌ర పోష‌కాలు కూడా వాములో ఉంటాయి. అందువ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి వాము ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తుంది.

వాము వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొందాలంటే.. రోజూ నేరుగా వామును తిన‌వ‌చ్చు. ఒక టేబుల్ స్పూన్ వాములో కొద్దిగా ఉప్పు క‌లిపి బాగా న‌లిపి వెంట‌నే ఆ వాము తిని నీటిని తాగాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అలాగే వాము టీ తాగినా మ‌న‌కు ఉప‌యోగాలు ఉంటాయి. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో కొద్దిగా వాము లేదా వాము ఆకులు వేసి నీటిని బాగా మ‌ర‌గ‌బెట్టాలి. నీరు మ‌రిగాక వ‌డ‌బోసి అందులో కొద్దిగా తేనె క‌లిపి వేడిగా ఉండ‌గానే తాగేయాలి. ఈ క్ర‌మంలో వాము టీ తాగ‌డం లేదా వాము తిన‌డం వ‌ల్ల మ‌న‌కు కింద తెలిపిన లాభాలు క‌లుగుతాయి.

1. వాము టీని తాగినా లేదా వామును తిన్నా హైబీపీ త‌గ్గుతుంది. విరేచ‌నాలు త‌గ్గిపోతాయి. బొంగురు పోయిన గొంతు స‌రి అవుతుంది. అలాగే జ‌లుబు, ద‌గ్గు వెంట‌నే త‌గ్గుతాయి.

2. శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు వాము టీ తాగ‌డం మంచిది. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే నిత్యం వాము టీ తాగాలి. మొటిమ‌ల స‌మ‌స్య ఎదుర్కొంటున్న వారికి వాము చ‌క్క‌గా ప‌నిచేస్తుంది.

3. నిత్యం వాము టీని తాగితే డిప్రెష‌న్ త‌గ్గుతుంది. వాములో ఉండే యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గిస్తాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.

4. నిత్యం వాము టీ తాగ‌డం లేదా వాము తిన‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ మెరుగ్గా ప‌నిచేస్తుంది. ముఖ్యంగా గ్యాస్‌, అసిడిటీ ఉండ‌వు.

Read more RELATED
Recommended to you

Latest news