మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ప్రజలందరికీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే క్యాష్‌లెస్ ఇన్సూరెన్స్‌ను కూడా అక్కడి ప్రజలకు ఫ్రీగా ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేష్ తోపె వివరాలను వెల్లడించారు. దీంతో దేశంలోనే ఇలా ప్రజలందరికీ ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్న మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డులకెక్కింది.
కాగా మహారాష్ట్రలో మహాత్మా జ్యోతిబాఫూలే జన్ ఆరోగ్య యోజన కింద 85 శాతం మందికి ఇన్సూరెన్స్ అందుబాటులో ఉండగా, తాజాగా చేసిన ప్రకటనతో మిగిలిన 15 శాతం మందికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లభ్యం కానుంది. ఈ క్రమంలోనే తమ స్కీంతో తెల్లరేషన్ కార్డు దారులకు ఎంతగానో ఉపయోగం కలుగుతుందని మంత్రి రాజేష్ తోపె తెలిపారు.
ఇక ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందించేందుకు గాను జనరల్ ఇన్సూరెన్స్ పబ్లిక్ సెక్టార్ అసోసియేషన్‌తో ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ప్రైవేటు హాస్పిటళ్లలోనూ కరోనా బాధితులకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌ను అందివ్వనున్నారు.