హరీష్ రావు… ప్రజల మనిషి.. ప్రసంశలు కురిపించి నందమూరి బాలకృష్ణ

-

నందమూరి బాలకృష్ణ నటుడిగా, హిందూపురం ఎమ్మెల్యేగానే కాకుండా బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే బసవతారకం క్యాన్సర్‌ 22వ వార్షికోత్సవ వేడుకలకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీషరావు ముఖ్య అతిథిగా హజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగంటే ఎన్టీఆర్ అని.. అటల్ బిహార్ చేతుల మీదుగా హాస్పిటల్ స్టార్ట్ చేశామన్నారు. నా తల్లి బసవతారకం కోరిక మీద ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసామని, ఈ సందర్భంగా ఆర్థికంగా ఆదుకున్న వారికి వందనాలు అని ఆయన వ్యాఖ్యానించారు. హరీష్ రావు… ప్రజల మనిషి అని ఆయన కొనియాడారు.

Balakrishna: Balakrishna who met Minister Harish Rao .. What issues were  discussed .. | Actor and mla balakrishna have meeting with telangana minister  harish rao and spoke about basavatarakam cancer hospital | PiPa News

ఆదర్శమైన నాయకుడు హరీష్ రావు అని, హాస్పిటల్ లోకి వచ్చిన వెంటనే.. మనో వ్యాధి తగ్గుతుందని, ఒక్కసారి వెళ్లి కలిస్తేనే.. ఆరు కోట్ల రూపాయిలను మాఫీ చేశారు హాస్పిటల్ కు(ట్యాక్స్) అని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ కింద పేషెంట్ లను ట్రీట్ చేస్తున్న హాస్పిటల్స్ లలో సెకండ్ ప్లేస్ ఉన్నామని, ఎంతోమంది దాతలు హాస్పిటల్ కు సాయం చేస్తున్నారన ఆయన వెల్లడించారు. మేము చేసే ప్రతి పనికి.. మీడియా ప్రజలకు అవగాహన కల్పిస్తుందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news