బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ త్వరలోనే తల్లి కాబోతుంది. ఆలియా భట్ ఈ శుభవార్త ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఆలియా భట్ రెండు నెలల క్రితమే ఏప్రిల్‌లో తన ప్రియుడు, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌భీర్ కపూర్ ని వివాహం చేసుకుంది. వీరిద్దరూ తమ మ్యారేజ్ లైఫ్ ని అన్యోన్యంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ బ్రహ్మాస్త్ర చిత్రంలో కలిసి నటిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆలియా సీత పాత్రలో రామ్ చరణ్ కి జోడీగా నటించిన సంగతి తెలిసిందే. కాగా తాను తల్లి కాబోతున్న విషయాన్ని చెకప్ చేయించుకున్న తర్వాత హాస్పిటల్ బెడ్ పై నుంచి ఆలియా ఈ న్యూస్ ఫ్యాన్స్ కి తెలియజేసింది. హాస్పిటల్ బెడ్ పై ఉన్న పిక్ ని కూడా పంచుకుంది. ఆలియా పక్కనే ఆమె భర్త రణబీర్ కపూర్ కూడా ఉన్నాడు. ఈ న్యూస్ తెలియగానే స్టార్ సెలబ్రిటీలు అంతా ఆలియా భట్ కి కంగ్రాట్స్ చెబుతున్నారు.
View this post on Instagram