మద్య నిషేదమన్న జగన్.. ఏటా రూ.5 వేల కోట్లు మద్యం ద్వారానే అక్రమార్జన చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పాత డిస్టలరీలను తన ఆధీనంలోకి తీసుకొని వాటిల్లో విషం నింపుతున్నారని, ప్రజల జీవితాలంటే జగన్కు లెక్కలేదా..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విషపూరిత మద్యం తాగటం వల్లే ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె మండిపడ్డారు. ప్రసిద్ది చెందిన ఎస్జీఎస్ ల్యాబొరేటరీస్ మద్యంలో విషపూరిత రసాయనాలు ఉన్నాయని తేటతెల్లం చేసిందని ఆమె వెల్లడించారు.
మంత్రి అంబటి రాంబాబు మాత్రం ఎటువంటి విషపూరితాలు లేవని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. తాము ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదని ఎస్జీఎస్ ల్యాబొరేటరీస్ సంస్థతో చెప్పించగలరా ? అని ఆమె సవాల్ విసిరారు. జంగారెడ్డిగూడెంలో విషపూరిత మద్యం వల్లే చనిపోయారని ప్రభుత్వ వైద్యులు చెప్పారని, మహిళల తాళిబొట్లు తెంపడానికి పన్నిన పన్నాగాలకు మావద్ద ఆధారాలున్నాయని ఆమె స్పష్టం చేశారు.