Telangana : గ్రూప్-3 రివైజ్డ్ ఖాళీల వివరాలివే

-

గ్రూప్‌-3 అభ్యర్థులకు కొత్త అప్‌డేట్‌ వచ్చింది. మహిళలకు సమాంతర రిజర్వేషన్‌లను అమలు చేస్తున్నందున గ్రూప్‌-3 నోటిఫికేషన్‌లో ఖాళీల వివరాల రివైజ్డ్‌ బ్రేకప్‌ను టీఎస్‌పీఎస్సీ శుక్రవారం వెల్లడించింది.ఈ రివైజ్డ్‌ ఖాళీల బ్రేకప్‌లో మహిళలకు రోస్టర్‌పాయింట్‌ తొలగించి, అన్ని ఖాళీలను రిజర్వు కేటగిరీల వారీగా ప్రకటించింది .

తెలంగాణలో గ్రూప్‌-3 సర్వీసు లో 1,388 ఉద్యోగాల భర్తీకి 2022 డిసెంబర్‌లో టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.దరఖాస్తుల పక్రియ 2023 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు కొనసాగగా.. 5,36,477మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉద్యోగ రాత పరీక్షలు ఈ ఏడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో టీఎస్ పీఎస్సీ నిర్వహించనుంది.ఈ గ్రూప్ 3 లో మొత్తం 26 విభాగాలకు చెందిన పోస్టులున్నాయి. వీటిలో సీనియర్ అకౌంటెంట్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. శాఖల వారీగా చూస్తే.. అత్యధికంగా ఆర్థిక శాఖలో 712 పోస్టులు ఉండగా.. ఉన్నత విద్యాశాఖలో 89, హోంశాఖలో 70.. రెవెన్యూ శాఖలో 73.. సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో 56 పోస్టులున్నాయి

.

Read more RELATED
Recommended to you

Latest news