కలలు ప్రతి మనిషికి రావడం సహజం..అయితే, కొన్ని కలలు నిజం అవుతాయని అంటున్నారు.రాత్రి ఏ సమయంలో వచ్చిన కలలు నెరవేరుతాయి అనే అంశంపై జనాలలో ఒక వార్త బలంగా వినిపిస్తోంది.అయితే, దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. అందుకే అసలు స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది? రోజూ వచ్చే కలల్లో ఏ సమయంలో వచ్చే కలలు నిజం అవుతాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది. కలలు భవిష్యత్తులో మంచి, చెడు సంఘటనలను సూచిస్తాయని ప్రజలు కూడా నమ్ముతున్నారు.రాత్రి వేళ వేర్వేరు సమయాల్లో వచ్చే కలల ఫలం వివిధ సమయాల్లో లభిస్తుందని స్వప్న శాస్త్రంలో కూడా పేర్కొన్నారు. అయితే, ఏ సమయంలో వచ్చిన కలలు నిజమవుతాయో అనే విషయంపై ప్రజల్లో ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి వివరాల్లోకి వెల్లాల్సిందే..
స్వప్న శాస్త్రం ప్రకారం.. రాత్రి 1, 2 గంటల మధ్య కనిపించే కలల ఫలాలు సాధారణంగా ఒక సంవత్సరంలో నెరవేరుతాయి. రాత్రి 3, 4 గంటల మధ్య వచ్చే కలలు త్వరగా నిజం అవుతాయని జనాలు విశ్వసిస్తారు. స్వప్న శాస్త్రం కూడా అదే చెబుతుంది. ఈ సమయంలో కనిపించే కలలు 6 నెలల్లో నిజం అవుతాయని అంటున్నారు.
రోజూ ఉదయం 4 నుంచి 5 మధ్య వచ్చే కలలు నిజమవుతాయి. మత గ్రంథాలలో ఈ సమయాన్ని అమృత్బెల్ల, చంద్రబెల్లా, బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు. ఈ సమయంలో భూమిపై ఉన్న విషయాలు దైవిక శక్తులచే ప్రభావితమవుతాయని చెబుతారు. ఈ సమయంలో వచ్చిన కలలు 3 నెలల్లో నిజమవుతాయని నమ్మకం..