నరేంద్ర మోడీ వాటలో.. కేసీఆర్‌ కోటా ఎంత..? : రేవంత్‌ రెడ్డి

-

ఇటీవల సీఎం కేసీఆర్‌ నిర్వహించిన మీడియా సమావేశంపై భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలో ప్రజుల వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కుంటుంటే కేసీఆర్‌ రాజకీయాలు మాట్లారంటూ విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా సమావేశం నిర్వహించి టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏమీ చేయలేదని..దిక్కు మాలిన మోడీతో పోల్చుతవా..? మోడీ క్రూరమైన నిర్ణయాల లో అన్నిటికీ కెసిఆర్ ప్రత్యక్ష పాత్ర ఉంది. నోట్ల రద్దు పై.. అసెంబ్లీ లో భట్టి మాట్లాడితే… ప్రధాని నీ అంటావా..? అని అడ్డగోలుగా మాట్లాడింది కేసీఆర్‌.. నరేంద్ర మోడీ వాటలో … కేసీఆర్‌ కోటా ఎంత..? అని రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట భీమా ఇవ్వడు కానీ.. రైతు చస్తే రైతు భీమా ఇస్తా అంటారు.. కేసీఆర్‌ ..ఎప్పుడైనా…సచ్చే వరకు చూస్తారు.. సచ్చిన తర్వాత పైసలు ఇస్తారంటూ రేవంత్‌ ధ్వజమెత్తారు.

TRS harassing leaders joining Congress party, says Revanth Reddy

మోడీ కి..కేసీఆర్‌కి వాటలో తేడాతో లొల్లి మొదలైందని, ఆకు రౌడీ..గల్లి రౌడీ మధ్య లొల్లి లాంటిదంటూ ఆయన వ్యాఖ్యానించారు. గుణాత్మక మార్పు..అంటారు అసలు నీ గుణమే గుడిచేదిరింది.. శ్రీలంక పరిస్థితులు చూసి కేసీఆర్‌కి భయం పట్టుకుంది.. మోడీ కి…కేసీఆర్‌కి నిజంగా చెడి పోతే…కొత్త కేసులు అవసరం లేదు… కాంగ్రెస్ పెట్టిన రెండు సీబీఐ కేసుల ఉన్నాయి.. చార్జి షీట్ వేయకుండా ఎందుకు మోడీ అపుతున్నరు అని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా అందరి మీద కేసులు పెట్టిన మోడీ… తెలంగాణ వరకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ మీద మోడీ.. ఈగ వాలకుండా చూస్తున్నారని మోడీ.. కేసీఆర్‌ లు తోడు దొంగలు అంటూ మండిపడ్డారు రేవంత్‌ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news