జగన్ కాన్వాయ్ వెళ్తుండగా… మర్గమధ్యంలో ఓ మహిళ అకస్మాత్తుగా జగన్ కాన్వాయ్ కు అడ్డుపడింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను పక్కకు లాగేశారు.
ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. తిరుమల దర్శనం అనంతరం ఆయన పద్మావతి అతిథిగృహంలో టిఫిన్ చేసి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు.
జగన్ కాన్వాయ్ వెళ్తుండగా… మర్గమధ్యంలో ఓ మహిళ అకస్మాత్తుగా జగన్ కాన్వాయ్ కు అడ్డుపడింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను పక్కకు లాగేశారు. ఆమె కాన్వాయ్ కి అడ్డు రావడాన్ని గమనించిన జగన్.. కార్లను ఆపించారు. వెంటనే ఆ మహిళ.. జగన్ దగ్గరికి పరిగెత్తుకొచ్చింది.
సార్.. మాది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. నా భర్తకు ఉద్యోగం లేదు. మాది చాలా పేద కుటుంబం. నా భర్తకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పించండి సార్.. అంటూ ఆమె జగన్ ను కోరేసరికి.. జగన్ సానుకూలంగా స్పందించారు. ఉద్యోగం కోసం పలానా అధికారులను కలవాలంటూ జగన్ కు ఆమె చెప్పి అక్కడి నుంచి విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఏపీకి కాబోయే సీఎం.. ఓ మహిళ తన కాన్వాయ్ ని అడ్డుకున్నా… సానుకూలంగా స్పందించి ఆమెకు దైర్యం చెప్పడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.