ప్రభుత్వ పాలనపై క్యాడర్ లో అసంతృప్తి ఉందా..? పార్టీలో జరుగుతున్న చర్చ ఇదే..

-

కార్యకర్తల మాటలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించిన పార్టీలు మనుగుడ సాధించినట్లు చరిత్రలో లేదు.. క్యాడర్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ.. ప్రజాకర్షణ నిర్ణయాలు తీసుకున్నప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది.. అధికారంలోకి కూడా వస్తుంది.. కార్యకర్తల వల్లే తాము అధికారంలోకి వచ్చామని ఎంతో మంది సీఎంలు, పార్టీ అధ్యక్షులు చెప్పిన సందర్బాలు కూడా ఉన్నాయి.. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వ పాలనపై క్యాడర్ లో జరుగుతున్న చర్చ ఏంటో ఒకసారి చూద్దాం..

1995 నాటి సీఎంను చూస్తారంటూ పదే పదే చెబుతున్న చంద్రబాబు నాయుడు.. అదే పంథాలు పయనిస్తున్నారు.. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ.. వారి వద్ద నుంచి సంక్షేమ పథకాల ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.. సీఎంవో కార్యాలయం నేరుగా అధికారులతో మాట్లాడుతోంది.. ఇక్కడ అధికారులతే పైచెయ్యిగా మారింది తప్ప.. క్యాడర్ కు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది..

కార్యకర్తలకు అధిక ప్రాధాతన్య ఇస్తానని గెలవకముందు చెప్పిన చంద్రబాబు.. గెలిచిన తర్వాత వారిని పట్టించుకోవడమే మానేశారన్న అసంతృప్తిలో క్యాడర్ లో కనిపిస్తోంది.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనపై దృష్టి పెట్టడం ఎంత ముఖ్యమో.. క్యాడర్ అసంతృప్తికి లోనూ కాకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం.. ఇది చంద్రబాబుకు తెలిసినా.. ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారన్న టాక్ పార్టీవర్గాల్లో వినిపిస్తోంది..

ప్రతి శనివారం చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తున్నా.. క్యాడర్ తో మాట్లాడే సమయం కేటాయించడం లేదట.. క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల, పాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నాన్నది వాస్తవాలు తెలియాలంటే గ్రౌండ్ లెవల్ లో ఉండే కార్యకర్తలే ముఖ్యం. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటే ఏదైనా కరెక్ట్ విషయాలు తెలుస్తాయి. కానీ చంద్రబాబు అలా చెయ్యడం లేదనే స్వంత పార్టీ క్యాడరే గుసగుసలాడుతోంది..

త్వరలో జమిలి ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం ఇటీవల జోరందుకుంది.. ఈ క్రమంలో చంద్రబాబుకు క్యాడర్ కు సమయం కేటాయించకపోతే ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.. భవిష్యత్ లో నైనా చంద్రబాబు కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తారో లేదో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news