ఏపీకి కాబోయే సీఎం.. అతిసామాన్యుడిగా దర్శనం

-

వైఎస్ జగన్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు. అయినప్పటికీ.. ఆయన సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టే… వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నేతలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు.

అయితే.. వైఎస్ జగన్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు. అయినప్పటికీ.. ఆయన సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టే… వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు.

నిజానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు శ్రీవారి మహాద్వారం నుంచి వెళ్లి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. కానీ.. జగన్ మాత్రం సామాన్య ప్రజలు వెళ్లే వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. జగన్ కు ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, అర్చకులు.. జగన్ కు ఆలయంలో ఘన స్వాగతం పలికారు.

స్వామి వారి దర్శనం అనంతరం.. వైఎస్ జగన్ ను అర్చకులు ఆశీర్వదించారు. స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. వైఎస్ జగన్.. తిరుమల స్వామి వారి దర్శనం కోసం నిన్న ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం వైఎస్ జగన్.. కడపకు వెళ్లనున్నారు.

కడపలో ఉన్న పెద్ద దర్గాను జగన్ దర్శించుకుంటారు. అనంతరం పులివెందులకు వెళ్లి… అక్కడ ఉన్న సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. తర్వాత ఇడుపులపాయకు వెళ్లి.. తన తండ్రి వైఎస్సాఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు.

ఇక.. వైఎస్ జగన్.. రేపు అనగా మే 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మధ్యాహ్నం 12.23 నిమిషాలకు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news