యాదవులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు

-

యాదవులకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. గొర్రెల పెంపకం ఎక్కువగా చేపట్టాలని.. తెలంగాణ రాష్ట్రంలో కురుమ, గొల్ల సోదరులకు గోర్లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. మరిన్ని గొర్రెలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. మీట్ ప్రాసెసింగ్ రావాలని.. మీట్ ఇండస్ట్రీ భారత దేశానికి కాక ఇతర దేశాలకు కూడా మాసం ఎగుమతి చేసే స్థాయికి రావాలని పిలుపునిచ్చారు.

మన రాష్ట్రంలో వరి ఎక్కువగా పండిస్తున్నామని.. వారికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని చెప్పారు. రాబోయే రోజుల్లో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు కోసం కృషి చేస్తున్నామని… ఇన్వెస్టర్లు సంతోషంగా ఉంటే వాల్లే మన బ్రాండ్ అంబాసిడర్ అన్నారు.

ఈ రాష్ట్రంలో ఇన్వెస్టర్లకు వేధింపులు లేవని….యూరప్ దేశాల్లో చదువుతో పరిశ్రమల అనుసంధానం తో శిక్షణ ఇస్తారన్నారు. హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పరిశ్రమలు విస్తరించాయని..రాష్ట్రమంతా కూడా పరిశ్రమలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 5 రకాల రంగాల్లో విప్లవాత్మకమార్పులు వచ్చాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news