కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కొన్ని వేల అకౌంట్ల ద్వారా హ్యాక్ చేసి తన సోషల్ మీడియా ఖాతాను డిలీట్ చేయించారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఇందిరా శోభన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇదిలాఉండగా, మరో వైపు ఆమె చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు, నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గతంలో షర్మిల వెంట తిరిగిన ఇందిరా శోభన్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరింది. అసలు ఎవరు నువ్వు? మీ సెన్స్ ఆఫ్ హుమర్ చాలా బాగుంది. అసలు నీకు నువ్వు ఎవరో చెప్పుకుంటే కానీ ఎవ్వరికి తెలీదు అని ఆమె మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమ్ కోసమేనా ఇదంతా అంటూ సెటైర్లు వేస్తున్నారు.