ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా ఉన్న బిబేక్ దెబరాయ్ (69) శుక్రవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా సంతాపం ప్రకటించారు.
భారత ఆర్థిక విధానాలను రూపొందించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారని మోడీ వెల్లడించారు.భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి విస్తృత కృషి చేశారు దెబరాయ్. బిబేక్ దెబరాయ్ గొప్ప ఆర్థిక పండితుడని.. చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత వంటి అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం ఉందని తెలిపారు. తన రచనల ద్వారా ఎంతోమందిని ఆకట్టుకున్నాడని ప్రత్యేకంగా ట్విట్ చేశారు.