మరో రికార్డు సాధించిన హైదరాబాద్ మెట్రో

-

హైదరాబాద్ మెట్రో మరో మైలురాయిని చేరుకుంది. ప్రయణా సేవలు ప్రారంభించిన 9నెలల్లో 2 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చి అరుదైన రికార్డుని సొంతం చేసుకుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము నిర్ణయించుకున్న గడువుకంటే ముందుగానే  ఈ రికార్డుని అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అమీర్ పేట – ఎల్బీనగర్ మార్గంలో మెట్రో సేవలు ప్రారంభమైతే మరిన్ని మైలు రాళ్లని చేరుకుంటామని ఆకాంక్షించారు. ప్రయాణికులకు ఇప్పుడున్న సౌకర్యాలతో పాటు మరిన్ని సదుపాయాలు కల్పించే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. మెట్రో సేవల్ని ఉపయోగించుకుంటున్న నగరవాసులకు ధన్యవాదాలు తెలుపుతూ..రాబోయే రోజుల్లో మెట్రో మరింత ఆదరణ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news