పీవీ సింధు గెలుపు దేశానికే గర్వకారణం – ప్రధాని మోదీ

-

ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సింధు ప్రపంచ 11 ర్యాంకర్ వాంగ్ జి ఈ (చైనా) పై గెలుపొందింది.కాగా పీవీ సింధు గెలుపుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఆమె క్రీడాస్ఫూర్తిని అభినందిస్తూ మోదీ ట్వీట్ చేశారు.” పీవీ సింధు మొట్టమొదటి సింగపూర్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకుంది. ఆమె తన అసాధారణమైన క్రీడా ప్రతిభను మరోసారి ప్రదర్శించి విజయం సాధించింది. ఈ విజయం దేశానికి ఎంతో గర్వకారణం. రాబోయే ఆటగాళ్లకు కూడా పీవీ సింధు విజయం స్ఫూర్తినిస్తుంది” అంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

కాగా షట్లర్‌ పీవీ సింధూ మరో సంచలన విజయం సాధించింది. 2022లో పీవీ సింధు మూడో టైటిల్‌ను గెలుచుకుంది. తాజాగా చైనా క్రీడాకారిణి వాంగ్‌ జి యిని ఓడించి షట్లర్‌ పీవీ సింధు సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 21-9, 11-21, 21-15 స్కోరుతో వాంగ్ జి యిని ఓడించి సింగపూర్‌లో తన తొలి టైటిల్‌ను  గెలుచుకుంది పీవీ సింధూ.

pm nare

Read more RELATED
Recommended to you

Latest news