అరే.. అయ్య తెల్వదు, తాతా తెల్వదు.. ఏందిరా అయ్యా ఈ రచ్చ.. మెంటల్ మాస్ అంటూ విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లైగర్ సినిమా ట్రైలర్ లాంచ్‌కి వచ్చిన అభిమానులను చూసిన విజయ్ కి ఒక్కసారిగా తనేంటో తనకే తెలిసినట్లనిపించింది. మాట్లాడింది తక్కువే కానీ బుల్లెట్టు మాత్రం దింపేశాడు.
ఢిల్లీ నుండి గల్లీ దాక విజయ్ ఫ్యాన్స్ బేస్ మామూలుగా లేదు. ముఖ్యంగా యూత్ విజయ్ మాటల్లోని రగడ్నెస్ కి ఫిదా అయిపోయారు. అర్జున్ రెడ్డి ఈవెంట్‌లోని స్పీచ్ ఎంత రా గా ఉందో అందరికీ గుర్తుండే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే అర్జున్ రెడ్డి సినిమా యూత్ కి తెగ నచ్చేసింది. అమ్మాయిలకు గ్రీకు వీరుడు, అబ్బాయిలకు గ్యాంగ్ లీడర్ గా మారిపోయాడు. విశ్వక్ సేన్, జొన్నల గడ్డ సిద్దులాంటి హీరోలు విజయ్ స్పీచ్‌ను ఫాలో అవుతున్నారు.
విజయ్ దేవరకొండ ఓ బ్రాండ్, ఓ సెన్సేషన్ ఓ ట్రెండ్ సెట్టర్.. యూత్ కి ఫ్యాషన్ ఐకాన్.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ ఇమేజ్ను సృష్టించుకున్నాడీ లైగర్ బాయ్. జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్లో వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు.
పెళ్ళి చూపులు, ‘అర్జున్ రెడ్డి’ గీతా గోవిందం వంటి హిట్లతో దేశ వ్యాప్తంగా యూత్‌లో ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది. స్టార్ హీరోయిన్లు, స్టార్ హీరోల డాటర్స్ కూడా విజయ్‌కి డై హార్డ్ ఫ్యాన్స్ గా మారిపోయారు. సోషల్‌మీడియాలో ఎక్కడ చూసి అమ్మాయిలు.. కాఫీ విత్ కరణ్ షోకి గెస్టులుగా వెళ్లిన స్టార్ డాటర్స్ కమ్ హీరోయిన్స్.. జాన్వీ కపూర్-సారా అలీఖాన్ కూడా విజయ్మీద తమకున్న క్రష్ ను బహిరంగంగా బయటపెట్టారు. కరణ్ జోహర్.. అడిగిన ప్రశ్నకు సిగ్గపడుతూ.. విజయ్‌తో డేటింగ్ చేయాలని ఉందని తమ మనసులోని మాటలను బయట పెట్టారు.
కాగా, రవిబాబు తీసిన నువ్విలా చిత్రంలో సపోర్టింగ్ రోల్‌తో పరిచయం అయ్యాడు రౌడీ బాయ్. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఎవడే సుబ్రమణ్యంలో సహాయ పాత్రలు పోషించి అందరి మెప్పు పొందాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ రౌడీ హీరో… అర్జున్ రెడ్డి తో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయాడు. అమ్మాయిల హృదయాల్లో ఒదిగిపోయాడు. గీతా గోవిందం సినిమాతో క్లాస్ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత విజయ్ చాలా సినిమాలు చేశాడు. కానీ ఆ స్థాయిలో ఏ సినిమా రీచ్ కాలేకపోయింది. కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కానీ అతడి నటనకు, స్టైల్‌కు అందరూ ఫిదా అయిపోయారు.