ఉపాధి పేరుతో వ్యభిచారం.. హైదరాబాద్ లో ముఠా అరెస్ట్‌.. !

-

హైదరాబాదులో రోజు రోజుకు దారుణాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. తాజాగా హైదరాబాదులో అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా ముఠా..మరోసారి వెలుగు చూసింది. ఉపాధి పేరుతో హైదరాబాద్ తీసుకువచ్చి వ్యభిచారం చేస్తోంది ఓ ముఠా. బంగ్లాదేశ్ చెందిన ఇద్దరు అమ్మాయిలను రెస్క్యూ చేసిన రాచకొండ పోలీసులు…వ్యభిచారం గుట్టు రట్టు చేశారు.

ఉప్పల్ పోలీసులతో కలిసి ఆంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి… వ్యభిచారం గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో ఏడుగురు నిర్వాహకులు అరెస్ట్ అయ్యారు. బంగ్లాదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ ,మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు విదేశీ యువతులను రక్షించారు పోలీసులు. బాధితుల్లో 15 సంవత్సరాల బాలికను కాపాడిన పోలీసులు.. నిందితులను పోలీస్‌ స్టేషన్‌ కు తరలించి.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news