అలర్ట్: కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం

-

కేరళ ప్రభుత్వం ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కరోనా వైరస్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. దేశంలో మొదటిసారిగా మంకీపాక్స్ కేసులు కేరళలోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ విధించింది. అయితే తాజాగా వాయనాడ్ జిల్లాలో ఉన్న రెండు పందుల ఫార్మ్స్ లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు పందుల బ్లడ్ శ్యాంపిళ్లను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ సంస్థకు పంపించారు.

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్

అయితే ఓ ఫార్మ్ హౌజ్‌లో భారీ సంఖ్యలో పందులు చనిపోయాయి. దీంతో పందుల శ్యాంపిళ్లను పరీక్షలకు పంపించినట్లు జంతుశాఖ అధికారులు తెలిపారు. అయితే పందుల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఫీవర్ వల్లే పందులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఫీవర్ వ్యాప్తితో అక్కడి ప్రభుత్వం 300 పందుల్ని వధించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. వ్యాధిని కట్టడి చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news