తెలంగాణలో మరో కొత్త మండలం

-

తెలంగాణలో మరో కొత్త మండలం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన ‘ఇనుగుర్తి’ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. అన్ని అర్హతలున్నందున కొత్త మండల కేంద్రంగా ఇనుగుర్తి ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను ఆదేశించారు.


సోమవారం ప్రగతిభవన్‌లో వరంగల్‌ ఉమ్మడి జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్‌ కవిత, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు ఇనుగుర్తి మండల ఏర్పాటును కోరుతూ సీఎంకు వినతిప్రతం ఇచ్చారు.

స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వారి సమక్షంలోనే తన నిర్ణయాన్ని వెల్లడించారు. అక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధుల దీర్ఘకాలిక కోరిక మేరకు ఇనుగుర్తిని మండలంగా చేస్తున్నట్లు తెలిపారు. 35 ఏళ్లుగా ఉన్న ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ సీఎం తీసుకున్న నిర్ణయంపై మంత్రులు, నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త మండలం ఏర్పాటుతో రాష్ట్రంలోని మండలాల సంఖ్య 608కి చేరనుంది.

Read more RELATED
Recommended to you

Latest news