జూన్ 10 రాశి ఫలాలు.. దానిమ్మ రసంతో అభిషేకం ఈ రాశులకు శుభం..!

-

జూన్ 10 సోమవారం- రోజు వారి రాశి ఫలాలు

మేషరాశి: స్నేహితులతో ఇబ్బందులు, ఆధిక ఖర్చులు, పనులు పూర్తి, కుటుంబ సంతోషం, ప్రేమ విషయాలు అనుకూలం, ఆరోగ్యం బాగుంటుంది, భాగస్వామితో ఇబ్బందులు.
పరిహారాలుః ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం మంచి చేస్తుంది.

వృషభరాశి: కోపం వల్ల సమస్యలు ఉత్పన్నం, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి, కుటుంబంలో కలహ సూచన, భాగస్వామితో మనస్పర్థలు, ఆరోగ్యంలో మార్పులు.
పరిహారాలు: స్నానం చేసే నీటిలో పాలను కొద్దిగా కలిపి స్నానం చేయండి మంచి జరుగుతుంది.

మిథునరాశి: ఆర్థిక సమస్యలకు చెక్‌పెడుతారు, ఆరోగ్యం బాగుంటుంది, భాగస్వామితో ఆనందం, ప్రేమ విషయాలు అనుకూలం, కుటుంబ సంతోషం, పనులు పూర్తి, ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు మంచి చేస్తాయి.

కర్కాటకరాశి: ఆశలు చిగురిస్తాయి, అధిక ఖర్చులు, వృత్తిలో సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం, ఏకగ్రతతో విజయం, భాగస్వామితో చికాకులు, ప్రయాణ సూచన.
పరిహారాలు: తెల్లపూలతో శివార్చన చేస్తే చక్కటి ఫలితాలు

సింహరాశి: భాగస్వామితో అనుకూలం, సంతోషం, సంపద పరంగా బాగుంటుంది, కుటుంబ సఖ్యత, ఆరోగ్య విషయాలు జాగ్రత్త, ఇంట్లో మార్పులు, వ్యాపార ప్రయత్నాలు దీర్ఘకాలంలో లాభం చేకూరుస్తాయి.
పరిహారాలు: శివునికి దానిమ్మరసంతో అభిషేకం చేయించుకోండి మంచి ఫలితాలు వస్తాయి.

కన్యారాశి: కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం బాగుంటుంది, బాకీలు వసూలు, వృత్తిలో పదోన్నతికి అవకాశం, విజయాలు, మాట్లాడేటప్పుడు అచితూచి మాట్లాడాలి, భాగస్వామితో ఇబ్బందులు.
పరిహారాలు: శివునికి అభిషేకం, పండ్లు నైవేద్యం మంచి ఫలితాన్నిస్తుంది.

తులారాశి: ఆరోగ్యం జాగ్రత్త, ఆర్థికంగా బాగుంటుంది, కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు, ప్రేమ అనుకూలం,తెలివితో వ్యవహరిస్తే చాలా విషయాలు పరిష్కారమయ్యే రోజు, భాగస్వామితో చికాకులు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం మంచి చేస్తుంది.

వృశ్చికరాశి: శరీరానికి విశ్రాంతినివ్వండి, ఆదాయంలో పెరుగుదల, కుటుంబంలో కొత్తవ్యక్తిరాక, సంబురాలు, లాభదాయకమైన రోజు, పనులు జాప్యం.
పరిహారాలు: శివాలయ దర్శనం, అభిషేకం మంచి చేస్తుంది.

ధనస్సురాశి: సొంతంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి, అధిక విశ్వాసం, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, స్నేహితుల కలయిక,వారి వల్ల మేలు, ముఖ్యమైన విషయాలు తొందరపాటు నిర్ణయాలు వద్దు, భాగస్వామితో మనస్పర్థలు.
పరిహారాలు: శివునికి దానిమ్మరసంతో అభిషేకం చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి.

మకరరాశి: దయా, ప్రేమతో పనులు చేయండి, స్నేహితులతో కలయిక, ఆర్థికంగా బాగుంటుంది, రియల్ ఎస్టేట్ కలసివస్తుంది, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త, భాగస్వామితో ఆనందం, పనులు పూర్తి, ప్రయానాలు కలసిరావు.
పరిహారాలు: శనిశాంతికోసం శివునికి దానిమ్మరసంతో అభిషేకం, పూజ చేస్తే చక్కటి ఫలితాలు.

కుంభరాశి: శారీరక సౌష్టవం కోసం క్రీడలు ఆడండి, పెండింగ్ ఏరియర్లు, బాకీలు వసూలు, మొహమాటం అడ్డువస్తుంది. మీకు సంబంధంలేని వాటిలో జోక్యం చేసుకోకండి. భార్యతో అనుకూలం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేస్తే మంచిది.

మీనరాశి: కోపతాపాలను అదుపుచేసుకోవాల్సిన సమయం, ఆరోగ్యం జాగ్రత, కుటుంబ సంతోషం, ప్రేమ విషయాలు అనుకూలం, ఆర్థికంగా ఇబ్బందులు, కొత్త ఒప్పందాలు లబ్దిని కలిగిస్తాయి.
పరిహారాలు: అరటి చెట్టును నాటండి లేదా నీరు పోయండి ఆర్థిక లాభాలు కలుగుతాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news