సోనూసూద్​ స్పెషల్​.. ఈ 5 విషయాలు మీకు తెలుసా?

-

సోనూసూద్​.. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు ఈ పేరు తెలియని వారుండరు. ఎవరినీ అడిగినా చెబుతారు. ఎందుకంటే కరోనా సమయంలో కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి లక్షల మందిని ఆదుకున్నారు. ఇప్పటికీ తన సేవాకార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. రీల్​ విలన్​ నుంచి రియల్​ హీరోగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన గురించి కొన్ని విశేషాలు మీకోసం…

సోనూసూద్ 23 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నారు. ఆ భార్య సోనాలి. కళ్లాకర్ అనే తమిళ సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో ఆయన కెరీర్ తొలినాళ్ళలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క అవకాశం కూడా దక్కించుకోలేక పోయారు. ఆయన ఆరుగురుతో కలిసి ఒకే రూమ్ లో ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవారట.

ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ సిల్వెస్టర్ స్టాలోన్ అంటే సోనూసూద్​కు చాలా ఇష్టం. ఆయన స్ఫూర్తితోనే సోనూ జిమ్​కు వెళ్లేవారట. వెళ్ళడం ప్రారంభించారు. బాగా కష్టపడి సిక్స్ ప్యాక్ బాడీని పెంచారు. ఇప్పటికీ ఆయన కఠోరమైన వ్యాయామాలు చేస్తూనే ఉంటారు. అందుకే దాదాపు 50 ఏళ్ల వయసు వచ్చినా.. యువకుడి లాగానే కనిపిస్తున్నారు. బాడీ పెంచడం మాత్రమే కాదు ఆయన కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకున్నారు. జాకీచాన్​తో సోనూకి మంచి పరిచయాలున్నాయి. తెర కూడా పంచుకున్నారు.

సోనూసూద్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆయనకు ధూమపానం,మద్యపానం లాంటి చెడు అలవాట్లు లేవు. ఆరోగ్యం పాడవుతుందని ఆయన అన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉన్నారు. ఆయన ఎక్కువగా పార్టీలకు కూడా వెళ్లరు. ఖాళీ సమయం దొరికితే కుటుంబ సభ్యులతో గడుపుతారు.

ఉత్తమ విలన్​గా అవార్డు అందుకున్న తొలి బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ కావడం విశేషం. ‘అరుంధతి’ సినిమాకు ఆయనకు అవార్డు లభించింది.

సోనూసూద్ ఎటువంటి వివాదాల్లో చిక్కుకోలేదు. కెరీర్ మొత్తంలో ఆయనపై చిన్న మచ్చ కూడా పడలేదు. కరోనా సమయంలో రియల్ హీరోగా మారిన సోనూ తన సొంత హోటల్స్​ను సైతం క్వారంటైన్ సెంటర్లుగా మార్చారు. అయితే ఆ తర్వాతే కోట్ల రూపాయలు పన్ను ఎగవేశారని ఆయన కార్యలయాలు, ఇళ్లపై రైడ్స్​ జరిగాయి.

సోనూ ఐకానిక్​ రోల్స్​..

అనుష్క ప్రధానపాత్రలో వచ్చిన ‘అరుంధతి’లో అఘోర పాత్ర వేసి ఉత్తమ విలన్​గా అవార్డు అందుకున్నారు. ఈ పాత్రతోనే ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆయన కెరీర్​ను కూడా మలుపు తిప్పింది.

సల్మాన్​ ఖాన్ ‘దబాంగ్’​ సినిమాలో చెడ్డీ సింగ్​గా విలన్ పాత్ర పోషించారు. ఈ పాత్రకు ఆయన మంచి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

హృతిక్​రోషన్​-ఐశ్వర్యరాయ్​ జంటగా వచ్చిన ‘జోదా అక్బర్’​లో ఆయన ఐష్​ అన్నయ్య సుజామల్​ పాత్ర పోషించారు. ఈ రోల్​లో తన ఎక్స్​ట్రార్డినరీ పెరఫార్మెన్స్​తో అదరగొట్టేశారు.

ఇంక హిందీలో ‘సింబా’, ‘సింగ్​ ఈజ్​ కింగ్’​లో పోషించిన విలన్​ రోల్స్​.. బాలీవుడ్​లో మంచి పాపులారిటీని తీసుకొచ్చాయి. ఇక తెలుగులోనూ ‘ఏక్​నిరంజన్’​లో సైకో విలన్​ పాత్ర, ‘జులాయి’లోని ప్రతినాయకుడి పాత్ర మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news