ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్..ఆ సర్టిఫికేట్ ప్లేసులో ఫేస్ రికగ్నిషన్ అథెంటికేషన్..

-

ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కేంద్రం మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.ఈపీఎఫ్ఓ పింఛనుదారుల కోసం కీలక నిర్ణయాలను తీసుకుంటూవస్తుంది కేంద్ర ప్రభుత్వం..తాజాగా మరో కొత్త పద్దతిని అమలు చేయనుంది.డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కోసం ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించడానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ బోర్డు ఆమోదించింది. తన 73 లక్షల మంది పెన్షనర్లు ఎక్కడి నుంచైనా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌లను సమర్పించే సౌకర్యాన్ని శనివారం ప్రారంభించింది…

జీవిత ధృవీకరణ పత్రాలను దాఖలు చేయడానికి వృద్ధాప్యం కారణంగా వారి బయో-మెట్రిక్స్ పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న పాత పెన్షనర్లకు ఈ ఫేస్ రికగ్నిషన్ అథెంటికేషన్ సహాయం చేస్తుంది. EPFO అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్.. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేంద్ర యాదవ్ పెన్షనర్లకు ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టినట్లు ఓ ప్రకటన లో తెలిపారు.

231వ సమావేశంలో పెన్షనర్లకు EPFO సేవలను మరింత మెరుగుపరచడానికి పెన్షన్, కేంద్రీకృత పంపిణీకి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇప్పుడు పెన్షనర్లకు సెంట్రల్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సూత్రప్రాయంగా ఆమోదం లభించనట్లయింది. అదే సమయంలో పెన్షన్ సమాచారం కోసం డిజిటల్ కాలిక్యులేటర్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కాలిక్యులేటర్‌ను కూడా కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఇది పెన్షనర్, కుటుంబ సభ్యులకు పెన్షన్ – డెత్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను లెక్కించేందుకు ఆన్‌లైన్ సౌకర్యాన్ని అందిస్తుంది.పెన్షన్ మొత్తం ఖాతాలో ట్రాన్సఫర్ చేయబడుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news