తాలింపుల్లో కరివేపాకు లేనిదే ఆ వాసనే రాదు.. రుచి అంతకంటే రాదు.. తెలుగు వంటకాల్లో కరివేపాకుది గొప్ప స్థానం. ఇది ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకులో భాస్వరం, కాల్షియం, ఇనుము, రాగి, విటమిన్లు, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. రోజు ఉదయం లేవగానే నాలుగు కరివేపాకు రెబ్బలు తింటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయట.. అవునా.. ఏంటో అవి..?
కళ్లకు మంచిది: కరివేపాకు ఆకులను తినడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. కరివేపాకులో చూపును మెరుగుపరిచే ముఖ్యమైన పోషకం విటమిన్ ఏ ఉంటుంది. ఇది రేచీకటీ లేదా కంటికి సంబంధించిన అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది.
డయాబెటిస్ బాధితులకు : కరివేపాకులో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే హైపోగ్లైసీమిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహం రోగులు రోజూ తింటే చాలా ఉత్తమంగా పనిచేస్తుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: కరివేపాకును ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నమిలి తింటే చాలా మంచిది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఎసిడిటీ, ఉబ్బరం వంటి అన్ని కడుపు సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది: కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది.
బరువు తగ్గుతుంది: కరివేపాకును నమిలి తినడం వల్ల బరువు, పొట్ట కొవ్వు తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో ఇథైల్ అసిటేట్, మహానింబైన్, డైక్లోరోమీథేన్ వంటి పోషకాలు ఉంటాయి.
జట్టు రాలే సమస్య ఉన్నవారు రెండు నెలల పాటు కరివేపాకు జ్యూస్‌ను తాగితే.. జుట్టు సమస్యలు అన్నీ తొలగిపోతాయని సైంటిఫిక్‌గా కూడా నిరూపించారు. కరివేపాకు ఆకును వేడినీళ్లలో మరిగించి కూడా తీసుకోవచ్చు కానీ జ్యూస్ చేసుకుని తాగితేనే మంచి లాభాలు పొందవచ్చు. వేడి చేసి తాగడం వల్ల అందులో ఉండే పోషకాలు సగానికి పడిపోతాయి. తాగగలిగితే వీలైనంత వరకూ జ్యూస్ చేసుకునే తాగాలి..!