రాజగోపాల్ రెడ్డిని తరిమికొట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారు – మునుగోడు మాజీ ఎమ్మెల్యే

-

మునుగోడు ప్రజలు చైతన్య వంతులు రాజగోపాల్ రెడ్డి మాటలు నమ్మరు .రాజగోపాల్ రెడ్డిని తరిమి కొట్టనికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని హెచ్చరించారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. చండూర్ మున్సిపాలిటీ లో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి…మాట్లాడారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తో జిల్లా అభివృద్ధి 20 ఏళ్లుగా వెనక్కి వెళ్ళింది…గట్టుప్పల మండల వెనకబాటుకు కారణం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ఆగ్రహించారు.

అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ కోమటిరెడ్డి బ్రదర్స్ అని ఫైర్ అయ్యారు. నియోజకవర్గం అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అని…గెలిచిన 3 ఇండ్లలో మునుగోడు ప్రజలకు ఎం పని చేయలేదు…కాంట్రాక్టుల కోసంమే బిజెపితో ఈ మూడేండ్ల సోపతి అన్నారు. మతి భ్రమించి,పిచ్చి చేష్టలు చేస్తున్నాడు.పూటకో మాట మాట్లాడుతున్నాడు మునుగోడు ప్రజలను తప్పు దరి పట్టిస్తున్నాడని మండిపడ్డారు మునుగోడు మాజీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్.

Read more RELATED
Recommended to you

Latest news