యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై NSUI, కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత ఖండించారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ లోనే ద్వేషం, హింస, విధ్వంసం ఉందని కవిత మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్భలంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నారని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకులు ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడటం దుర్మార్గమని స్పష్టం చేశారు. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
రాహుల్ గాంధీ వల్లించే మొహభృత్ కి దుకాన్ ఒక బూటకమని తేటతెల్లమైందని.. అది విద్వేషం, హింసను ప్రేరేపించే దుకాణమని కవిత ధ్వజమెత్తారు. ఇలాంటి హింసా రాజకీయాలను తెలంగాణ తిరస్కరిస్తుందని, హింసకు రాజకీయాలను తెలంగాణ తిరస్కరిస్తుందని, హింసకు విధ్వంసకర చర్యలకు తెలంగాణలో తావు లేదని తెలిపారు. కాంగ్రెస్ తన యువజన విభాగాన్ని గూండాల విభాగంగా తీర్చిదిద్దుతోందని మండిపడ్డారు.