స్నేహ రెడ్డి ధరించిన ఈ బుల్లి బ్యాగ్ ధర తెలిస్తే షాక్.!

-

స్నేహ రెడ్డి.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టుల ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇకపోతే అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా కూడా తన కుటుంబానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనడంలో సందేహం లేదు . ముఖ్యంగా తన భార్య స్నేహారెడ్డి పట్ల ఎప్పటికప్పుడు తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ జంటకు అల్లు అయాన్ , అల్లు అర్హ అనే ఇద్దరు పిల్లలు కూడాఉన్నారు.

ఇక అల్లు అర్హ ఇప్పటికే సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. సమంత లేడీ ఓరియంటెడ్ చిత్రంగా పౌరాణిక చిత్రం లో భరతుడి చిన్నప్పటి పాత్రలో ఈ చిన్న పాప నటించింది. ఇకపోతే ఈ పిల్లలకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను అల్లు స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. ఇక అల్లు అర్జున్ కూడా సమయం దొరికితే చాలు ఫ్యామిలీని తీసుకొని విదేశాలకు, విహారయాత్రలకు వెళుతూ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఇలా ప్రతి విషయాన్ని కూడా అల్లు స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది..ఇకపోతే స్టార్ హీరోలు మీడియాకు ఎంత దగ్గరగా ఉంటారో.. వారి భార్యలు మాత్రం లైమ్ లైట్ లో ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా మీడియా దృష్టికి దూరంగా ఉన్నప్పటికీ స్టార్ హీరోల భార్యలపై మాత్రం ప్రేక్షకులు ఫోకస్ చేస్తారని చెప్పవచ్చు.

ఇక ఈ క్రమంలోనే తాజాగా స్నేహ రెడ్డి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈమెను అందరూ ఫ్యాషన్ ఐకాన్ గా పిలుస్తూ ఉంటారు. రకరకాల దుస్తులు , యాక్సెసరీస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే ఈమె క్యారీ చేసిన ఒక హ్యాండ్ బ్యాగ్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఇటీవల ఒక పార్టీకి హాజరై.. ఆ పార్టీ నుండి కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది. ఇక ఆ అందమైన స్లిప్ దుస్తులు అలాగే ఎరుపు రంగు మినీ డియోర్ బ్యాగ్ వేసుకొని అందరిని ఆకర్షించింది.ఈమె వేసుకున్న ఆ బుల్లి రెడ్ కలర్ బ్యాగు ధర అక్షరాల రూ. 2,13,826.. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news