‘కార్తికేయ 2’ విడుదల విషయంలో ఏడ్చా : నిఖిల్

-

తన సినిమా కార్తికేయ 2 ప్రచారంలో భాగంగా హీరో నిఖిల్ ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ‘కార్తికేయ 2’ విడుదల వాయిదాపై ఎమోషనల్‌గా మాట్లాడారు. మానసికంగా ఎందో దృఢంగా ఉండే తాను.. ఈ సినిమా విడుదల విషయంలో ఏడ్చానని చెప్పారు.
‘‘ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన హీరోల చిత్రాలు అటో ఇటో వెళ్తుంటాయి అంటారు కదా. అది మా సినిమా విడుదల విషయంలోనూ జరిగింది. ఎట్టకేలకు ‘కార్తికేయ 2’ను ఆగస్టు 12న విడుదల చేద్దామనుకోగా ఆ రోజునా కొందరు వద్దన్నారు. ‘అక్టోబరులోనో, నవంబరులోనో రిలీజ్‌ చేస్కోండి. ఇప్పుడప్పుడే మీ సినిమా విడుదల కాదు, మీకు థియేటర్లు ఇవ్వం’ అని మాట్లాడారు. మానసికంగా నేనెంతో దృఢంగా ఉంటా. అయినా ఆ సమయంలో ఏడ్చా. మా నిర్మాతలు విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ పట్టుబట్టి ఆగస్టు 12ని ఖరారు చేశారు. సినిమాల విడుదలలో క్లాష్‌ ఉంటే ఓపెనింగ్స్‌ తగ్గుతాయనే దాంట్లో వాస్తవం ఉంది. కానీ, ఎప్పుడైనా ఏదో ఓ సినిమాతో మా చిత్రం పోటీ పడాల్సిందే కదా’’ అని నిఖిల్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
నిఖిల్ వ్యాఖ్యలపై నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. నీకు నేనున్నా’ అంటూ నిఖిల్‌ సిద్ధార్థ్‌కు భరోసానిచ్చారు. ధైర్యంగా ఉండండి. మంచి కంటెంట్‌ ఎప్పుడూ విజయం సాధిస్తుందంటూ ‘కార్తికేయ 2’ టీమ్‌కు విష్ణు అండగా నిలిచారు. ఆ చిత్రం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఆ మేరకు విష్ణు చేసిన ట్వీట్‌కు నిఖిల్‌ బదులిచ్చారు. ‘‘విష్ణు అన్నా నీ మాటలు నాకు, కార్తికేయ 2 చిత్ర బృందానికి ఎంతో విలువైనవి ’’ అని ఆనందం వ్యక్తం చేశారు.
https://twitter.com/iVishnuManchu/status/1554312800209498112?cxt=HHwWgMCj5bbQg5IrAAAA

Read more RELATED
Recommended to you

Latest news