BREAKING : ప్రేమించలేదని.. యువతి గొంతు కోశాడు

-

నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది డిగ్రీ విద్యార్థినిపై హత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

నల్గొండ జిల్లాలో డిగ్రీ కళాశాల విద్యార్థిని నవ్య గొంతుపై రోహిత్ అనే యువకుడు బ్లేడ్ తో దాడి చేశాడు. అతణ్నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించిన నవ్వ చివరకు విఫలమైంది. గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో రోహిత్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నవ్యను ఆస్పత్రికి తరలించారు.

తన కుమార్తెను రోహిత్ కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని నవ్య తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రేమను నిరాకరించడం వల్లే తన కూతురిని చంపడానికి ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసిన రోహిత్ ను కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news