కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పారు. చండూరు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరికాదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హోంగార్డు ప్రస్తావన అలాగే చండూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు రేవంత్ రెడ్డి.
పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని వెల్లడించారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరే వయసు ఎందుకు అందరం కలిసికట్టుగా పని చేయాల్సి ఉందన్నారు.
ఇది ఇలా వుండగా ఉపఎన్నిక కసరత్తు మీటింగ్‌కు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఏ మీటింగ్ జరిగినా నాకు సమాచారం ఇవ్వడం లేదు. నాకు ఆహ్వానం లేని మీటింగ్‌కు నేను ఎందుకు వెళ్తా. చండూరులో సభలో అసభ్యంగా తిట్టించారు. హోంగార్డుతో పోల్చారు. దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. తనకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి.