మొలకెత్తిన శనగలు, బెల్లం కలిపి తినేస్తున్నారా..?

-

బరువు తగ్గాలనుకునే వారినుంచి మొదలు దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు, డైలీ వ్యాయామాలు చేసే వారు ఇలా చాలామంది ఉదయం మొలకెత్తిన విత్తనాలు తినడం అలవాటు చేసుకుంటారు. కొందరు జిమ్‌లోనే తీసుకుంటారు.. మరికొందరు ఇళ్లలో చేసుకుంటారు. అయితే ఈ విత్తనాలు బోలెడు రకాలు ఉంటాయి. సాధారణంగా ప్రకృతి వైద్య నిపుణులు వీటిని ఎండు విత్తనాలను నానపెట్టుకుని వాటితో పాటు తినమని చెబుతుంటారు. డ్రై ఫ్రూట్స్, స్ప్రౌట్స్‌, పచ్చికొబ్బరి, ఖర్జూరం, నాలుగు పండ్ల ముక్కలు అంతే వీటితోనే టిఫిన్‌ అయిపోతుంది. అయితే మొలకెత్తిన విత్తనాలకు బెల్లం జోడించి తింటే సూపర్‌ రిజల్ట్‌ ఉంటుంది అంటున్నారు.. బెల్లం ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మరోవైపు శెనగల్లో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలున్నాయి. అయితే బెల్లంలో ఐరన్, మెగ్నీషియం లాంటివి పుష్కలంగా లభిస్తాయి.ఈ రెండింటిని కలిపి తినడం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం..!
మొలకెత్తిన శనగలు, బెల్లం తింటే..
రక్తహీనత దూరమవుతుంది- శరీరంలో రక్తం లేకపోవడంతో (రక్తహీనత) బాధపడుతుంటే మొలకెత్తిన శెనగలు, బెల్లం తినవచ్చు. ఈ రెండూ ఐరన్‌కు మంచి మూలాలు. దీని కారణంగా రక్తంలో ఆక్సిజన్, ఎర్ర రక్త కణాలను పెరుగుతాయి. ఇది శరీరంలో రక్తహీనతను దూరం చేస్తుంది. వీటితో పాటు రక్తహీనత ఉన్న బచ్చలకూరను బాగా తినాలి. వీలైతే బచ్చలకూర జ్యూస్‌ కూడా తాగొచ్చు. ఈ ఆకుతో డైలీ ఏదో ఒక కూర చేసుకుని తినడం వల్ల బాడీకి రక్తం పడుతుంది.
ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి- ఒక గుప్పెడు మొలకెత్తిన శెనగలు, బెల్లం కలిపి తీసుకుంటే ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి. వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మీ ఎముకలను బలంగా చేస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది- మొలకెత్తిన శనగలు, బెల్లంలో మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతే కాదు ఇవి రెండు కలిపి తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
కడుపుకు మేలు చేస్తుంది: మొలకెత్తిన శనగలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
సో..మీకు ఎలాగూ మొలకెత్తిన శనగలు తినే అలవాటు ఉంటే వాటికి బెల్లం జోడించండి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా మేరకే బెల్లం తీసుకోవాల్సి ఉంటుంది. మీ షుగర్‌ లెవల్స్‌ను బట్టి రోజుకు ఎంత వరకు బెల్లం తీసుకోవచ్చు వైద్యులు సూచిస్తారు. దాన్ని బట్టి తినొచ్చు. మిగతావారు అయితే ఏ సందేహం లేకుండా లాగించేయొచ్చు.!

Read more RELATED
Recommended to you

Latest news