ఆసియా కప్ లో టీమిండియా కచ్చితంగా గెలవగలదు – పాకిస్తాన్

-

ఆసియా కప్ ట్రోఫీ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ తెలపడనున్నాయి. ఇక ఈ ప్రతిష్టాత్మక టోర్నీ లో ఇప్పటికే ఏడుసార్లు విజేతగా నిలిచిన టీమ్ ఇండియా ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఈసారి కప్ ను లిఫ్టు చేయగల సత్తా భారత్ కు ఉందా, అంటూ సల్మాన్ బట్ కు సోషల్ మీడియా వేదికగా ప్రశ్న ఎదురైంది.

ఇందుకు స్పందించిన ఈ పాకిస్తాన్ మాజీ కెప్టెన్, “కచ్చితంగా వాళ్ళు గెలవగలరు. వాళ్ళకేమైనా విటమిన్లు తక్కువయ్యాయా? గత కొన్ని రోజులుగా ఇండియా అద్భుతంగా ఆడుతోంది. వాళ్లకు చాలామంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. కాబట్టి వారినే చాలామంది ఫేవరేట్లుగా పేర్కొంటున్నారు” అని అన్నాడు.

ఇక ఇతర జట్ల విజయావకాశాల గురించి మాట్లాడుతూ, “పాకిస్తాన్ జట్టు తనదైన రోజు చెలరేగి ఎవరినైనా ఓడించగలదని అందరికీ తెలుసు. టి20 ఫార్మాట్ లో మెరుగైన భాగస్వామ్యాలే కీలకం. అయితే, ఆరోజు పరిస్థితి ఎలా ఉందన్న అంశం మీదే గెలుపు,ఓటములు ఆధారపడి ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ ను కూడా తక్కువగా అంచనా వేయలేం. ఇక బంగ్లాదేశ్ విషయానికొస్తే వాళ్ళు ఒక్కోసారి బాగానే ఆడతారని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news