టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేస్తూ.. ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించగల బౌలర్. అయితే.. టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ, ఆయన భార్య హాసిన్ జహాన్ విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీ, కేంద్రం హోం మంత్రి అమిత్ షాకు హాసిన్ జహాన్ చేసిన విన్నపం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఐ లవ్ భారత్’ అని చెప్పిన ఆమె, మన దేశం పేరును భారత్ గా కానీ, హిందుస్థాన్ గా కానీ మార్చాలని మోదీ, అమిత్ షాలను ఆమె కోరారు. మన దేశం మనకు గర్వకారణం అని చెప్పారు. దేశం వజ్రోత్సవ స్వాతంత్ర వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో హాసిన్ జహాన్ చేసిన ప్రతిపాదన అందరిని ఆకర్షిస్తోంది.