అసోం రంగాపాడాలోని దయాల్పుర్ గ్రామంలో రూ.500 కోసం ఇద్దరు స్నేహితులు గొడవ పడ్డారు. ఈ గొడవ ఘర్షణకు దారి తీసి ఒకరి ప్రాణం బలితీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితుడిని చంపిన తర్వాత అతడి తల తీసుకుని నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
దయాల్పుర్ గ్రామానికి చెందిన తునీరామ్ మాద్రి.. బ్రోయిలర్ హేమ్రామ్(55) తల నరికాడు. అనంతరం ఆ తల, కత్తి పట్టుకొని 10 కిలోమీటర్లు నడిచి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. హేమ్రామ్కు రూ. 500 అవసరమై మాద్రిని అడిగాడు. నిరాకరించిన మాద్రిని రామ్ బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది.
కోపోద్రిక్తుడైన తునీరామ్ మాద్రి ఆవేశంలో తన దగ్గర ఉన్న పదునైన కత్తితో హేమ్రామ్ మెడపై వేటు వేశాడు. ఆ తల పట్టుకొని పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు