రాబోయే 100 రోజులు చాలా కీలకం – మాణిక్యం ఠాకూర్

-

తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్లో మునుగోడు ఉప ఎన్నికపై సమీక్షా సమావేశం జరిగింది. 20వ తేదీన మునుగోడు నియోజక వర్గంలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని అన్నారు మాణిక్యం ఠాగూర్. గాంధీ కుటుంబాల త్యాగాల గురించి పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. 20వ తేదీన కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి కలవాలని చెప్పారు.

మన శక్తి వంతన లేకుండా కృషి చేయాలన్నారు. సెప్టెంబర్ 7వ తేదీన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభం అవుతుందన్నారు మాణిక్యం టాగూర్. అక్టోబర్ చివరకు తెలంగాణ లో రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుందన్నారు. రాబోయే వంద రోజులు మనకు చాలా కీలకమని.. ప్రతి ఒక్కరు శక్తి మేరకు పని చేయాలన్నారు. మన లక్ష్యం ఒక్కటే.. కాంగ్రెస్ పార్టీ ని గెలిపించుకోవాలన్నారు. మన.మునుగోడు.. మన కాంగ్రెస్ అనే నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్ళి విజయం దిశగా ముందుకు సాగాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news