రేపటి నుంచి పట్టాలెక్కనున్న గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్

-

కడప మీదుగా గుంటూరు-తిరుపతి : మధ్య రాకపోకలు సాగించే రైలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని కడప రైల్వేస్టేషన్ మేనేజర్ డి.నరసింహా రెడ్డి మంగళవారం తెలిపారు. గుంటూరులో ఈ రైలు (17261) ప్రతిరోజు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి నరసరా వుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురంరోడ్డు, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం మీదుగా కడపకు అర్ధరాత్రి 12.45 గంటలకు వస్తుందన్నారు.

నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి మరుసటిరోజు ఉదయం 4.25 గంటలకు చేరుతుంది. తిరుపతిలో ఈ నెల 19న రాత్రి 7.35 గంటలకు బయలుదేరి కడపకు రాత్రి 9.55 గంటలకు చేరుకుని మరుస టిరోజు ఉదయం 8.00 గంటలకు గుంటూరు వెళుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news