నాగార్జున ” ది ఘోోస్ట్ ” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

-

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటిస్తున్న “ది గోస్ట్” చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాకు ది గోస్ట్ అనే టైటిల్ పెట్టి క్యూరియాసిటీని పెంచేసింది చిత్ర బృందం. ఇటీవల విడుదలైన యాక్షన్ ప్రోమోకు ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన వచ్చింది. అయితే ఈ సినిమా నుండి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

ఈ సినిమా నుండి మేకర్స్ ట్రైలర్ డేట్ ని ప్రకటించారు. ది గోస్ట్ ట్రైలర్ను ఆగస్టు 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రం బృందం. నాగార్జున, సోనాల్ చౌహన్ చేతిలో గన్స్ పట్టుకొని హగ్ చేసుకున్న పోస్టర్ ని విడుదల చేశారు.  ఇక ఈ సినిమాలో నాగార్జున ఓ ఇంటర్పోల్ ఆఫీసర్ పాత్రలో అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో అందాల భామ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ గా ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news