జగన్ వేసిన రోడ్లపై వెళ్తే.. ఫ్రీ డెలివరీ ఖాయం – ఆదినారాయణ రెడ్డి

-

జగన్ వేసిన రోడ్లపై వెళ్తే.. ఫ్రీ డెలివరీ ఖాయమని.. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేమస్ ఫ్రీ గైనకాలజిస్టుగా జగన్ పేరు తెచ్చుకున్నారని చురకలు అంటించారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. జగన్ ఓ పిల్లకాయ… పిల్లకాయ అయిన జగనుకే అంత అహం ఉంటే.. ప్రధాని మోడీకి ఎంత అహం ఉండాలని అన్నారు. దేశాన్ని ప్రేమించమని గురజాడ అప్పారావు చెప్పారు… జగన్ మాత్రం గోరంట్లకు ఓ ప్రేమ.. అవంతికి ఓ ప్రేమ, అంబటికి మరో ప్రేమ పంచాడని ఎద్దేవా చేశారు.

ఆయన గురజాడ అప్పారావు అయితే.. జగన్ అప్పుల అప్పారావని… ప్రపంచం కరోనాతో భయపడితే.. ఏపీ జరోనాతో భయపడుతోందని చలోక్తులు పేల్చారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. జగన్ తన ఉద్యోగం కోసం భారతీ సిమెంట్స్ పెట్టుకున్నారని… రాష్ట్రంలోని నిరుద్యోగులకు మాత్రం మొండి చేయి చూపారని ఆగ్రహించారు. జగన్ పోలవరానికి పొగ పెట్టారు.. అమరావతికి అగ్గి పెట్టారని మండిపడ్డారు. జగన్ తన ఉద్యోగం కోసం భారతీ సిమెంట్స్ పెట్టుకున్నారు… రాష్ట్రంలోని నిరుద్యోగులకు మాత్రం మొండి చేయి చూపారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news