కొంతమంది పిల్లలు అక్షరాలను తిరగేసి ఎందుకు వ్రాస్తారంటే..?

-

చిన్న పిల్లలు ఒకేసారి అన్ని నేర్చుకోలేరు. పైగా అందరి పిల్లలు అక్షరాలని త్వరగా నేర్చుకోలేరు. కొందరు పిల్లలు సులువుగా అక్షరాల నేర్చుకోగలుగుతారు కానీ మరి కొంత మంది పిల్లలు మాత్రం అక్షరాలు రాయడం లో తికమక పడుతుంటారు దీంతో వారు తిరగేసి అక్షరాలను రాస్తూ ఉంటారు.

దీనిని మీరు జయం సినిమాలో చూసే వుంటారు. అయితే ఇలా అక్షరాలను రాస్తే తల్లిదండ్రులు టీచర్లు కూడా వాళ్ళని మందలిస్తూ ఉంటారు. అయితే అసలు ఎందుకు చిన్నపిల్లలు అక్షరాలను తిరగేసి రాస్తూ ఉంటారు అనేది ఇప్పుడు చూద్దాం.

ఈ విధంగా అక్షరాలు రాయడం ని మిర్రర్ రైటింగ్ అని అంటారు. అంటే అక్షరాలు ని ఫ్లిప్ చేసి రాయడం. అయితే చిన్న పిల్లల ఎదుగుదలలో భాగంగా చిన్న చిన్న పొరపాట్లు సహజం. ఇది కూడా అంతే. అంతే కానీ ఇదేమి డిసార్డర్ కాదు. మొదట వారు ఇలా రాసినా తర్వాత సరైన విధంగా రాయడం అవుతుంది. కనుక ఎప్పుడైనా మీ పిల్లలు కూడా ఇలా వ్రాస్తే వారిని మందలించద్దు. సరి చేస్తే సరిగ్గా నేర్చుకుంటారు. వారి చేతి వ్రాత పైన దృష్టి పెట్టె లాగ చేస్తే సరి పోతుంది. క్రమంగా ఇలా వారు ఈ అలవాటు నుండి బయటకు రాగలరు.

 

Read more RELATED
Recommended to you

Latest news