సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రశ్నించేందుకు “ఇందూరు జనతా కో జవాబ్ దో” అనే నినాదం తో ఈ నెల 3 న బీజేపీ సభ నిర్వహిస్తున్నామన్నారు నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. ఎన్నికల హామీలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు ధర్మపురి అరవింద్.
సీఎం పర్యటనకు తనకు ఇంకా ఆహ్వానం అందలేదని.. సభలో తనకు మాట్లాడే అవకాశం కల్పించాలన్నారు.
రైతులు, కార్మికులు, మహిళలు నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. దళిత గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఉంద్యమంలో అమరులైన కుటుంబాలను విస్మరించారన్నారు. బీహార్ వెళ్లిన సీఎం తెలంగాణ పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి కేసీఆర్ ను బీహార్ కు రానివ్వకుండా చేసుకున్నారని అన్నారు. మూడు నెలల తర్వాత టిఆర్ఎస్ నాయకత్వం అడ్రస్ గల్లంతవుతుందన్నారు ఎంపీ అరవింద్.