తెలంగాణలో పోషకాహార లోపంపై ఉన్న గణాంకాలను రానున్న 18 నెలల్లో తిరగ రాస్తామని రాష్ట్ర ఐటీశాఖ కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ పోషకాహారంలోపంపై కేటీఆర్ ట్వీట్‌కు స్పందిస్తూ.. మణిపాల్ యూనివర్సిటీ ఛైర్మన్ మోహన్ దాస్ సవాల్ విసిరారు.
‘చాలా కాలంగా తెలంగాణను పాలిస్తున్నారు కదా.. మీ రాష్ట్రంలో పోషకాహారలోప గణాంకాలు ఎలా ఉన్నాయో చూపించండి అంటూ ఛాలెంజ్ మోహన్ దాస్ విసిరారు. దీనికి స్పందించిన మంత్రి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటూ ట్వీట్ చేశారు. ‘నా మాటలు గుర్తుంచుకోండి.. కర్ణాటకలోని 40 శాతం కమిషన్ ప్రభుత్వాన్ని, గుజరాత్లో రేపిస్ట్ ఉపశమన ప్రభుత్వాలను అధిగమిస్తామని’ కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు.
తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని ఈ ఏడాది చివర్లోగా ప్రారంభిస్తామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. స్మారకం సిద్ధమవుతోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. సచివాలయం ఎదుట లుంబినీపార్కు పక్కన విశాలంగా అమరవీరుల స్మారకాన్ని నిర్మిస్తున్నారు. ప్రధాన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం స్టీల్ క్లాడింగ్ పనులు కొనసాగుతున్నాయి. అనంతరం వెల్డింగ్ సహా ఇతర పనులు పూర్తి చేయాల్సి ఉంది. అమరులకు ఎల్లప్పటికీ రుణపడి ఉంటామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Challenge accepted Mohan👍
In the next 18 months, you will see a remarkable turnaround in malnutrition stats of my state
Mark my tweet; we will outdo both the 40% commission Govt in Karnataka & Rapist Remission Govt in Gujarat@SatyavathiTRS Garu & @WCDTelangana let’s gear up https://t.co/6jensKrgVs
— KTR (@KTRTRS) September 2, 2022